HomeTelugu Trendingమ్యాగజైన్‌ కోసం బికినీలో మెరిసిన అనుష్క అందాలు

మ్యాగజైన్‌ కోసం బికినీలో మెరిసిన అనుష్క అందాలు

5 9
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జంట లాక్‌డౌన్‌లో పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ సెలెబ్రిటీ జంట తమ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను పలకరిస్తున్నారు. అంతేగాక అనుష్క ఒక టాలెంటెడ్ ఫిల్మ్ అండ్ వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్. మోడలింగ్ రంగం నుండి వచ్చిన అనుష్క తన సినీ కెరీర్లో ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించింది. కొంతకాలంగా అనుష్క తెరమీద తక్కువగా కనిపిస్తోంది. అయితే అనుష్క ఇంట్లో ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. తాజాగా అనుష్క శర్మ వోగ్ మ్యాగజైన్ కోసం దిగిన బికినీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. టూ పీస్ బికినీ వేసుకొని పైన స్లీవ్‌లెస్ కోటులో నెటిజన్లను కట్టిపడేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య అనుష్క బికిని ఫోటో చూసిన విరాట్ ఓ గమ్మత్తైన ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. మాటలకు అందని భావనను పలికించాడు. కళ్లలో ప్రేమ మెరుపులు వెలిగించి.. ఆమె అందంపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అనుష్క శర్మ బికినీ ఫోటోపై నెటిజన్లు, అభిమానులే కాకుండా బాలీవుడ్ నటి అలియాభట్ కూడా కామెంట్ చేసింది. నిజమైన అందానికి నిదర్శనం అంటూ కామెంట్ పెట్టింది. ఇక నెటిజన్లు ఆమె అందాన్ని రకరకాలుగా వర్ణిస్తూ కామెంట్లు చేశారు. దాదాపు 2 మిలియన్ల మంది లైక్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu