HomeTelugu Trendingనెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు సినిమా ‘పిట్ట కథలు’ టీజర్‌

నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు సినిమా ‘పిట్ట కథలు’ టీజర్‌

Pitta Katha Teaser

హిందీ‌లో హిట్‌ అయిన ‘లస్ట్‌ సోరీస్‌’ వెబ్‌ సిరీస్‌ తెలుగులో ‘పిట్ట కథలు’ పేరుతో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. మొత్తం నాలుగు కథలుగా ఉన్న ఈ సీరిస్‌ని నలుగు దర్శకులు తరుణ్‌ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్‌ అశ్విన్‌ , సంకల్ప్‌ రెడ్డి.. తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ బుధవారం విడుదలైంది. మంచు లక్ష్మి, ఈషారెబ్బా, శృతిహాసన్, అమలా పాల్, జగపతిబాబు, సత్యదేవ్, మేఘన, సంజిత్ హెగ్డే నటించిన ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సిరీస్ కథాంశమే బోల్డ్ కాబట్టి, టీజర్ లో కూడా ఆదే స్థాయి ఉంటుందో చూపించారు. నాలుగు విభిన్న కథలు కలిగిన మహిళలు వారి జీవితానికి చెందిన ప్రేమ, ఎమోషన్స్ వాటికి వారి నలుగురికి ఉన్న కామన్ కనెక్షన్ ఏమిటి అన్నదే ఈ సిరీస్‌ చూపించనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu