HomeTelugu Trendingసైన్స్‌లో సత్తాచాటిన మహిళలకు ఈ సినిమా అంకితం: అక్షయ్‌

సైన్స్‌లో సత్తాచాటిన మహిళలకు ఈ సినిమా అంకితం: అక్షయ్‌

5 2మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ ‘మిషన్‌ మంగళ్‌‌’ సినిమాను ప్రశంసించారు. ఈ సినిమా బెంగాలీ ప్రోమోను చూసిన ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. మహిళా శాస్త్రవేత్తల ధైర్యం, బలాన్ని చూపించినందుకు యూనిట్‌ను అభినందించారు. ‘ఆకాశమే హద్దు అనుకుని ధైర్యం, నమ్మకం, మనోబలంతో ముందుకు సాగిన మహిళల కథల్ని సినిమాగా చూపిస్తున్నందుకు ‘మిషన్‌ మంగళ్‌‌’ కు సెల్యూట్‌ చేస్తున్నా. బెంగాలీ ప్రోమో చూడండి’ అని ఆయన యూట్యూబ్‌ లింక్‌ను షేర్‌ చేశారు. దీనికి అక్షయ్‌ ప్రతిస్పందించారు. ‘ధన్యవాదాలు దాదా.. సైన్స్‌ భాష యూనివర్సల్‌. దానికి జాతి, రంగు, హద్దు, లింగ భేదాలు లేవు. సైన్స్‌లో సత్తాచాటిన అద్భుతమైన మహిళలకు ఈ సినిమా అంకితం చేస్తున్నా. ఏదైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించు’ అని ట్వీట్‌ చేశారు.

‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో అక్షయ్‌ ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ పాత్రలో కనిపించనున్నారు. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. జగన్‌ శక్తి సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విద్యా బాలన్‌, తాప్సి, నిత్యా మేనన్‌, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ ‘మంగళ్‌యాన్‌’ మిషన్‌ కోసం ఎంతో శ్రమించిన మహిళా శాస్త్రవేత్తలుగా నటించారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu