Homeతెలుగు Newsఆంధ్రప్రదేశ్‌లో పాలకులు కుంభకోణాలకు పాల్పడ్డారు: మోడీ

ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు కుంభకోణాలకు పాల్పడ్డారు: మోడీ

6 1ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తనకు తెలుసని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, విశాఖ, విజయనగరం బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తలతో ఢిల్లీ నుంచి మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినన్ని సంస్థలు దేశచరిత్రలో ఏ రాష్ట్రానికీ దక్కలేదు. ఇలాంటి సంస్థలను ఏపీలో ఇంతకాలం ఏర్పాటు చేయనందుకు టీడీపీ, కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విజన్‌ను యువతకు వివరించండి. యువతతో అన్ని అంశాలపై క్షుణ్నంగా చర్చించండి.. వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏపీలో పాలకులు ఏదైనా చేసి ఉంటే ఆ పని గురించి మాట్లాడేవారు. యువత వ్యతిరేక ప్రచారాన్ని నమ్మదు, అవినీతిని సహించదు. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి. అర్హులైన యువత ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించండి’ అని పార్టీ శ్రేణులకు మోదీ దిశానిర్దేశం చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు కుంభకోణాలకు పాల్పడ్డారు. నాడు ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్‌గా అభివర్ణిస్తే.. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు దోస్త్‌ కాంగ్రెస్‌ అంటున్నారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ మహాకూటమిని ప్రజలు తిరస్కరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలను చాలా వరకు మా ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బీజేపీ కార్యకర్తలు తెలియజెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌మార్పు కోరుతోంది. ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏవిధంగా విభజించింది జనం మరిచిపోయారు. ప్రజల మనోభావాలను లెక్క చేయకుండా అన్నదమ్ములను విడదీశారు. విభజనపై మిగతా పార్టీలు రాజకీయం చేస్తుంటే ఏపీకి న్యాయం కోసం మాట్లాడింది బీజేపీయే. బీజేపీ ఏం చేసిందో ప్రజలకు కార్యకర్తలు వివరించారు. జనవరి 6వ తేదీన మరోసారి మీతో మాట్లాడతా’ అంటూ మోడీ తన ప్రసంగం ముగించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu