ఈ దీపావళి జీవితాంతం గుర్తుండిపోతుంది: సోనాలీ

బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే ఈ సారి దీపావళిని సంప్రదాయం ప్రకారం జరుపుకోలేదంటున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో క్యాన్సర్‌ చికిత్స పొందుతున్నారు సోనాలీ. ఈ క్రమంలో భర్త గోల్డీ బెహల్‌, కొడుకు రన్‌వీర్‌తో కలిసి న్యూయార్క్‌లోనే దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు సోనాలీ.

దాంతో పాటు ‘న్యూయార్క్‌లో దీపావళి పండుగ ఓ రోజు ఆలస్యంగా వస్తోంది. అందుకే లేట్‌గా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సారి పండుగను చాలా సింపుల్‌గా జరుపుకున్నాము. భారతీయ దుస్తులు లేవు.. నా పూజా మందిరం లేదు. చిన్నచిన్న దేవుడి ప్రతిమలు. పండుగను సంప్రదాయం ప్రకారం జరుపుకోలేదు.. కానీ మనస్ఫూర్తిగా జరుపుకున్నాం. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పండుగ’ అంటూ భర్త, కొడుకుతో కలిసి పూజ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు సోనాలీ.