HomeTelugu Trendingయాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు..

యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు..

4 4
తెలుగు హాట్‌ యాంకర్‌ శ్రీముఖిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు… నల్లకుంట నుంచి వచ్చిన శర్మ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. ఓ ప్రముఖ టెలివిజన్‌ ఛానల్‌‌లో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఓ షోలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా.. వాళ్లను కించ పరిచేలా శ్రీముఖి వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ శర్మ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు.

శర్మ ఫిర్యాదు మేరకు శ్రీముఖితో పాటు, ఆ ప్రముఖ ఛానెల్ యాజమాన్యంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈయన.. దాంతో వాళ్లపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది శ్రీముఖి. అన్ని ప్రముఖ ఛానెల్స్‌లో కూడా ఈమె కార్యక్రమాలు చేస్తుంది. అందులో కొన్ని రియాలిటీ షోస్ట్‌ కూడా చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu