HomeTelugu Trendingదసరా: కీర్తి సురేశ్‌ డబ్బింగ్‌ వీడియో వైరల్‌

దసరా: కీర్తి సురేశ్‌ డబ్బింగ్‌ వీడియో వైరల్‌

keerthy sureshs dubbing vid
కీర్తి సురేశ్ టాలెంట్‌ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. పాత్ర ఏదైనా ఆ పాత్రలో ఒదిగిపోతుంది కీర్తి సురేశ్. అలాంటి కీర్తి సురేశ్ ఇటీవల నటించిన చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో ఆమె వెన్నెల పాత్రలో మాస్ లుక్ తో .. డీ గ్లామర్ గా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటన చాలా అద్భుతంగా ఉంది.

తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ కథలో ఆమె తెలంగాణ యాసలోనే డైలాగ్స్ చెప్పింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఆమె డబ్బింగ్ చెప్పుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె డబ్బింగ్ చెబుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎంత మాత్రం తడబడకుండా ఆమె డబ్బింగ్ చెబుతున్నప్పటి వీడియో చూస్తే, ఆమె అంకితభావం ఏ రేంజ్ లో ఉందనేది అర్థమవుతుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో పెళ్లి కూతురుగా ఒక మ్యూజిక్ లెంగ్త్ లో కీర్తి వేసిన మాస్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu