HomeTelugu Newsనాని హీరోయిన్‌పై పోలీస్‌కేస్‌

నాని హీరోయిన్‌పై పోలీస్‌కేస్‌

9 19

నేచురల్‌ స్టార్‌ నాని ఆహా కళ్యాణం సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ నటి ‘వాణి కపూర్’ గుర్తుంది కదా.. ఆ భామపైనే ఇప్పుడు పోలీస్ కేస్ నమోదైంది. దాంతో పాటు హిందువులు కూడా ఈ ముద్దుగుమ్మపై గుర్రుగా కనిపిస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్యే అమ్మడు ఓ జాకెట్ వేసుకుని హాట్ ఫోటోషూట్ చేసింది. అందులో తప్పేముంది అనుకుంటున్నారా..?

అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఆమె వేసుకున్న జాకెట్‌పై రామ్ అనే అక్షరాలు ఉన్నాయి.. రాముడు పేరుతో ఉన్న ఇలాంటి దుస్తులు ధరించి హిందువుల మనోభావాలు దెబ్బ తీశావంటూ వాణిపై మండిపడుతున్నారు హిందుత్వ వాదులు. అంతేకాదు.. ఆమెపై ఏకంగా ముంబై పోలీసులకి ఫిర్యాదు కూడా చేసారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదం ముదురుతున్న క్రమంలో వాణి కపూర్ తన ఫోటోని పర్సనల్ అకౌంట్ నుండి తొలగించింది. అయితే అప్పటికే ఆమెపై కేసు నమోదైపోయింది. మరిప్పుడు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!