ఎన్టీఆర్ క్యాలండర్ ఆవిష్కరణ!

నందమూరి తారకరామా రావు గారి 21 వ వర్ధంతి సందర్భంగా 18-01-2017న నందమూరి అభిమానుల సమక్షంలో నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి క్యాలండర్ ని బసవ తారకం ఇండో కాన్సర్ హాస్పిటల్ లో  ఆవిష్కరించారు. మొదటి కేలండరును తుమ్మల కిరణ్ కి అందించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల కిరణ్, తుమ్మల రమేష్, కొమ్మినేని వెంకటేశ్వర రావు, తుమ్మల ప్రసన్నకుమార్ మరియు ఇతర నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ క్యాలండర్ చాలా బాగుందని బాలకృష్ణ గారు ప్రశంసించారు.  మొదటి క్యాలండర్ అందుకున్న తుమ్మల కిరణ్ బసవ తారకం హాస్పిటల్ లో పలు సేవ కార్యక్రమాలతో పాటు.. బయట కూడా చాలా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.