Homeతెలుగు Newsఏపీ నిరుద్యోగులకు శుభవార్త..ఎస్సై పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..ఎస్సై పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల

11ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 3,137 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్ఐతోపాటు అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, కానిస్టేబుళ్లు, డిప్యూటీ జైలర్, వార్డర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 24 మధ్య ఎస్ఐ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ, ఏపీ ఆన్‌లైన్‌, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష డిసెంబర్‌ 16న నిర్వహిస్తారు. పోలీస్‌ కానిస్టేబుల్, వార్డర్ల అప్లికేషన్లు ఈ నెల 12 నుంచి డిసెంబర్‌ 7 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షను 2019 జనవరి 6న నిర్వహించనున్నారు.

మిగతా వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి slprb.ap.gov.in

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!