HomeTelugu Trending100 పేద కుటుంబాల‌కి పూజా హెగ్డే సాయం

100 పేద కుటుంబాల‌కి పూజా హెగ్డే సాయం

Pooja Hegde arranges one mo

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే కొవిడ్ సంక్షోభం వ‌ల్ల ఇబ్బంది ప‌డుతోన్న వారికి త‌న‌వంతు సాయం చేశారు. లాక్‌డౌన్ కార‌ణంగా స‌మస్య‌లు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల‌కి అండ‌గా నిలిచారు. 100 కుటుంబాల‌కు నెల‌కు స‌రిప‌డా స‌రుకుల్ని అందించి, త‌న ఉదార‌త‌ని చాటుకున్నారు. వాట‌న్నింటిని త‌నే స్వ‌యంగా ప్యాక్ చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడయాలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు, పూజా అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా బారిన ప‌డిన పూజా ఇటీవ‌ల కోలుకున్న సంగ‌తి తెలిసిందే. కొవిడ్ పాజిటివ్ వ‌చ్చినంత మాత్రాన భ‌య‌ప‌డ‌కూడ‌ద‌ని, ఆక్సీమీట‌ర్ ఎలా ప‌డితే అలా వాడ‌కూడ‌దు అంటూ.. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వీడియోలు రూపొందించి నెటిజన్‌కి ధైర్యాన్నిస్తున్నారు. ఇక సినిమాల విషయాన్నికి వస్తే.. ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘రాధేశ్యామ్’, రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ‘ఆచార్య‌’లో న‌టిస్తోంది ఈ బుట్ట బొమ్మ. అఖిల్‌తో క‌లిసి న‌టించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ రిలీజ్‌కు రెడీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu