HomeTelugu Trendingసల్మాన్‌ఖాన్‌తో నటించడంపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు..

సల్మాన్‌ఖాన్‌తో నటించడంపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు..

10 11

పూజాహెగ్డే బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ రోగా నటించిన ‘మొహంజోదారో’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే గతేడాది విడుదలైన ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రంతో బాలీవుడ్‌లో పూజాహెగ్డే మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలో ఆమె సల్మాన్‌ఖాన్‌తో కలిసి ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’ చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజాహెగ్డేను ఓ ఆంగ్ల పత్రికవారు ఇంటర్వ్యూ చేయగా.. సల్మాన్‌తో నటించాల్సి ఉన్న సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘సల్మాన్‌ఖాన్‌తో పనిచేయడమంటే మనలోని టాలెంట్‌కు ఇంకొంచెం మెరుగులద్దుకోవాలని అర్థం. ఎన్నో సంత్సరాల నుంచి ఆయన సినిమాల్లో ఉవన్నారు. ఆయనకు ఎంతో అనుభవం ఉంది. అందువల్లే నేను కొంచెం భయపడుతున్నాను. స్టార్‌ హీరో, హీరోయిన్‌లతో నటించే సమయంలో ఇలాగే ఉంటుందేమో. కానీ ఎన్నో మెళకువలు నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం అనుకుంటున్నాను. ఈ కథ చాలా కూల్‌, ఫన్నీగా ఉంటుంది. ఆగస్టు నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను రీషెడ్యూల్‌ చేయాలని భావిస్తున్నారు.’ అని తెలిపారు పూజాహెగ్డే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu