HomeTelugu Newsఎన్టీఆర్‌కు జోడిగా పూజా లేదా రష్మిక?

ఎన్టీఆర్‌కు జోడిగా పూజా లేదా రష్మిక?

15 8
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ తో చేయనున్నాడనే విషయం ఖరారైపోయింది. కథపై కసరత్తు పూర్తి కాగానే, ఎన్టీఆర్ తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారు అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే .. రష్మిక పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ ఇంతకుముందు చేసిన ‘అరవింద సమేత ‘లోను .. ‘అల వైకుంఠపురము’లో సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు విజయవంతం కావడం వలన, ఆ సెంటిమెంటుతో మళ్లీ ఆమెను తీసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరో వైపున రష్మిక కూడా వరుస హిట్లతో తన జోరు చూపిస్తోంది. అందువలన జోడీ కొత్తగా అనిపిస్తుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసే అవకాశాలు కూడా ఎక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu