బాలయ్యకు ‘కర్ణ’ దొరికేలా లేదు!

నందమూరి బాలకృష్ణ 102వ సినిమాకు టైటిల్ గా ‘కర్ణ’ అనే పేరును అనుకుంటున్నారు చిత్రబృందం. మొదట్లో జయసింహ, రెడ్డిగారు లాంటి పేర్లు వినిపించినప్పటికీ చివరగా కర్ణ అనే టైటిల్ ను పెట్టాలని నిర్ణయించుకున్నారు. అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించాలని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ టైటిల్ ను ఇదివరకే ఎవరో రిజిస్టర్ చేయించేశారు. దీంతో బాలయ్య అండ్ టీం కు ఇదొక సమస్యగా మారింది. ఇప్పుడు వారు చేయాల్సినవి రెండే రెండు.. ఒకటి టైటిల్ మార్చడం, లేదంటే ‘కర్ణ’ టైటిల్ ను ఎవరు తీసుకున్నారో..? తెలుసుకొని వారి దగ్గరకు వెళ్ళి ఆ టైటిల్ ను ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం. అది కూడా అంత సులువైన పని కాదు. అవతలి వారు టైటిల్ ఇవ్వడానికి అంగీకరించాలి. లేదంటే మళ్ళీ జయసింహ, రెడ్డిగారు వంటి టైటిల్స్ ఎలాగో ఉన్నాయి. 
మరి ఈ విషయంలో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. చూడాలి. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు.