పోసానిని హేళన చేసిన బోయపాటి!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. మాస్
చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బోయపాటిని ప్రారంభ దశలో పోసాని కృష్ణ మురలి, ముత్యాల
సుబ్బయ్య గారికి పరిచయం చేశారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన బోయపాటిని
ముత్యాల సుబ్బయ్య గారికి పరిచయం చేసింది నేనే.. అలాంటి బోయపాటి నన్ను ఓసారి
చాలా తక్కువ చేసి మాట్లాడారని పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మీ
దగ్గర పని చేసిన చాలా మంది టెక్నీషియన్స్ ఇప్పుడు టాప్ పొజీషన్ కు వెళ్లారు.. వారిని
చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందని ప్రశ్నించగా.. త్రివిక్రమ్, కొరటశివ ఇలా నా దగ్గర
పని చేసిన ముప్పై మందికి పైగా దర్శకులు మంచి స్థానంలో ఉన్నారు. వారు ఇప్పటికీ నాకు
గౌరవం ఇచ్చి మాట్లాడతారు. కానీ బోయపాటి శీను మాత్రం నేను డైరెక్ట్ చేసిన ఓ సినిమా
ఫ్లాప్ అయిందని మా ఆవిడ దగ్గరకి వెళ్ళి ‘మేమంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాం. అనయ్య
కు ఆ అనుభవం లేదు కదా.. అందుకే సినిమా పోయింది.. ఇంటికి సంబంధించిన బిల్స్
కట్టడానికి ఇబ్బందిగా ఉంటుందేమో కదా.. అంటూ హేళనగా మాట్లాడారని తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates