HomeTelugu Big Storiesవైఎస్ జగన్ లేటెస్ట్ ఇన్నోవేషన్ గ్రామ స్వరాజ్యం

వైఎస్ జగన్ లేటెస్ట్ ఇన్నోవేషన్ గ్రామ స్వరాజ్యం

గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. దేశం బాగుండాలంటే పల్లెలు పచ్చగా ఉండాలనేది మన అందరికి తెలుసు. కానీ ఆ దిశగా ఏడు దశాబ్దాలుగా మన పాలకులు అడుగులు వేసింది మాత్రం కొందరే. అందులో ముఖ్యమంత్రిగా తొలిసారిగా భాద్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థను కీలకమైన ప్రభుత్వ శాఖలందరి ఉద్యోగులతో అనుసంధానం చేస్తూ కొత్త పరిపాలన విధానానికి శ్రీకారం చుట్టారు. గ్రామలాభివృద్దే రాష్ట్రం దేశాభివృద్ధికి నాందనే నినాదంతో రాష్ట్ర రాజధాని స్థాయిలో అన్ని శాఖలు సెక్రటేరియట్ లోన్నట్టు గ్రామ స్థాయిలో కూడా ఒకే కార్యాలయంలో ఏర్పాటు చేయడంతో పాలనవిధానం సామాన్య ప్రజలకు అందుబాటులోండేలానడుం బిగించారు.

jagan

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గ్రామ సచివాలయాలు ఓ సువర్ణ యుగం:

సామాన్య ప్రజలు కాళ్లకు చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పాలన కొనసాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు ముందడుగు వేశారు. జాతి పిత మాహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి గ్రామాలు, వార్డుల్లో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యాయంలో దాదాపు 34 విభాగాలకు సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలు గ్రామ సచివాలయల్లో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు కేవలం 72 గంటల్లోనే సామాన్య ప్రజలకు అందడమే లక్ష్యంగా పేదల కళ్ళల్లో కన్నీరును తుడిచి ముఖంపై చిరునవ్వులు పూయించడమే పరమావధిగా పని చేసేందుకు ప్రణాళికలు తయారయ్యాయి. దాదాపు 500 సేవలు గ్రామ సచివాలయాల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా కొత్త సంవత్సరం 2020 జనవరి ఒకటి నుంచి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ పథకాలన్నీ గ్రామ సచివాలయం పరిధిలోకి తీసుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల లబ్ది దారుల వివరాలను రాజకీయాలు, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఎంపిక చేసి నోటీసు బోర్డులో వివరాలుండేలా జాగ్రత్తలుండబోతున్నాయి. గ్రామ స్థాయి సచివాలయం నుంచి రాజధాని సెక్రటేరియట్ వరకు ప్రజలు ఎలాంటీజ్ సమస్యపైనైనా సరే ఫిర్యాదులు చేసేందుకు సీఎం పేషిలో 1902 నెంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇకపై ప్రజల సమస్యలను పసిగట్టేందుకు గ్రామ సచివాలయం వాలంటీర్లు, సెక్రటేరియట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండుకళ్లలా పని చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కదం తొక్కుతోంది.

 

గ్రామ సచివాయాల్లో సర్కారు కొలువుల జాతర :

దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగ మేళా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో 1లక్ష 35 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షలకు పైగా అభ్యర్థులకు 8 రోజులు పరీక్షలు నిర్వహించి 1లక్ష 35వేల మందికి శాశ్వత ఉద్యోగాలు రావడం ఈ గిన్నిస్ రికార్డులాంటిది. ఇప్పటికే ఈ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి నిరుద్యోగ యువతకు సర్కారు కొలువుల పత్రాలను కూడా అమాత్యులందరు కలిసికట్టుగా అందజేశారు. గ్రామ సచివాలయా ఏర్పాటుతో గ్రామ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని విజయవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. హిస్టారికల్ విక్టరీ సొంతం చేసుకున్న తర్వాత విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 2019 మే 30న ప్రమాణ స్వీకారం సమయంలో ఇచ్చిన హామీని ఆక్టోబర్ రెండున ఆచరణలో పెట్టడం ఆనందానికి అవధులు లేవని సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయబడ్డారు. 150వ గాంధీ జయంతి దినోత్సవం నుంచి గ్రామ సచివాలయాల్లో కొత్తగా నియమించబడ్డ ఉద్యోగులు బాధ్యతలను నిర్వహించనున్నారు. పల్లెల్లో జనం కన్నీరు పెట్టకుండా 24గంటలు ప్రజల వద్దకే పాలన అందించడం లక్ష్యంగా సామాన్య జనం కష్ట నష్టాలను తీర్చేపనిలో ఈ కొత్త ఉద్యోగులు నిమగ్నులు కాబోతున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ తొలిసారిగా ప్రారంభమైంది. ప్రతి యాబై కుటుంబాలకు ఓ గ్రామ వాలంటీర్, మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకో వాలంటీర్ నియమించడంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అమలు పరిచేందుకు గ్రామ సచివాలయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సర్వ సన్నద్ధం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలతో పాటు మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను పటిష్టంగా ఈ గ్రామ సచివాలయాల ఉద్యోగులు భాద్యతలు నిర్వర్తించడం అలాగే గ్రామ సచివాలయాల పనితీరును రాజధానిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండే పరిశీలించనున్నారు. ఒక్కో గ్రామ సచివాలయంలో పదకొండు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు పనిచేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1లక్ష 35వేల ఉద్యోగులతో ఓ ప్రత్యేక వ్యవస్థను సృష్టించడంతో కొత్తగా 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ప్రారంభమవుతున్నాయి.

సర్కారు ముందుచూపుతో సొంత గ్రామాల్లోనేఉద్యోగాలు చేయకుండా ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా నియామక పత్రాలు ఎంపికైనా ఉద్యోగికి స్థానిక గ్రామంలో కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో నియమించడం జరిగింది. ప్రతి గ్రామంలో ఎలాంటి వర్గ విబేధాలు, వివక్షత లేకుండా ప్రతీ ఒక్కరికీ వైసీపీ సర్కారు అందిస్తోన్న సంక్షేమ పథకాలు పొందేలా గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పనులు చేసేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించారు.

ys jagan polavaram

ప్రతిపక్షం పచ్చ పార్టీ మాత్రం ఓర్వలేని తనం :
వైఎస్ జగమ్మోహన్ రెడ్డి సర్కారు దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేలా గ్రామ స్వరాజ్యమే ప్రధానోద్దేశ్యంతో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుంటే ఓర్వలేక కుళ్ళుకొంటున్న, జీర్ణించుకోలేని పచ్చపార్టీ టిడిపి అధినేత చంద్రబాబు ప్రతీ నిమిషం విషం గక్కుతున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ నాకంటే సీనియర్ రాజకీయాల్లో ఎవరు లేరనే సొంత డబ్బా కొట్టుకునే ఆయన స్థాయిని మరిచి ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామ వాలంటీర్లు వెళ్లి డోర్లు కొడతారంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఈ నోటి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది.
ఐదేళ్లు అధికారంలోన్నప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా చేతులెత్తేసిన చంద్రబాబు గ్రామ సచివాలయ ఉద్యోగుల వ్యక్తిత్వాలను కించపరుస్తూ మాట్లాడడం, మహిళల శీలాలను శంకించే విధంగా దూషించడం చంద్రబాబుకే చెల్లింది. జాబు రావాలంటే బాబు రావాలనే ప్రకటనకు పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో ఘోరంగా విఫలమయ్యారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం లక్షా 25 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు బృందం కారుకూతలు కూస్తున్నారు.
పరీక్ష పత్రం లీకేజ్‌ అయితే పరీక్షా జరిగిన రోజో లేక ముందుగానే బట్టబయలయ్యేది. యువతలో కూడా దానిపై వ్యతిరేకత, ఆందోలనలు చేసేవారు కానీ ఫలితాలు విడుదలైన తర్వాత పచ్చ కామెర్లున్న పచ్చపార్టీకి అనుకూల జాతీయ మీడియాతో పిచ్చి రాతలు రాయించిన, కూయించిన పచ్చ పబ్లిసిటీ పనులు విజయవంతం కాలేకపోవడంతో కారుకుతాలు కూస్తున్నారు. పల్లెటూళ్లు వెస్ట్ పట్నాలే బెస్ట్ వ్యవసాయం చేయడమే వృధా విజన్ 2020లో మనం ప్రపంచంలోనే ది బెస్ట్ అంటూ ప్రగల్భాలు పలికే పచ్చపార్టీ నేతల పరిణామాలన్నింటిని పరిశీలిస్తే భవిష్యత్తులో గ్రామవాలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై చంద్రబాబు అండ్‌ కో ఎన్ని నీలపానిందలైన వేయడానికి వెనుకాడరని అర్థమవుతోంది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక పథకం గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ ప్రజల నుదుటిరాతను సువర్ణాక్షరాలతో రాయబోతుందనడంలో కాలమే సమాధానం చెబుతుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైన కొత్త విధానం/వ్యవస్థను ప్రజలకు అలవాటు కావడానికి సమయం అవసరం. అలాగే గ్రామ సచివాలయ, వాలంటీర్ల పనితీరు ఫలితాలు రావడానికి ఖచ్చితంగా కొంత కాల వ్యవధి పడుతుంది. కానీ మంచి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా రాబోతున్నాయనడంలో అనుమానం అవసరంలేదు. ఈ అవకాశాన్ని ప్రజలు ఆశీర్వదించి సొంతం చేసుకుని సద్వినియోగపరుచుకుంటే మాహాత్మ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచే అంకురార్పణ చేసినప్పటికీ దేశ వ్యాప్తంగా అమలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి లంచాలు మంచాలు లేకుండా పారదర్శక పాలనలో పనులు జరగేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు. మరో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతి ఏటా నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జనవరిలో భర్తీ చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu