HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

పవన్‌ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

Power Star pawan kalyan tes 1

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు సంబంధించిన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా డాక్టర్ల సలహా మేరకు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. గత వారం పది రోజులుగా పవన్ కళ్యాణ్ పరివారంలోనివారు ఒక్కొక్కరుగా కరోనా బాధపడుతూ వస్తున్నారు. వీరందరు ఆయనకు సమీపంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా.. కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.

తాజాగా పవన్ కళ్యాణ్.. హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పవన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స కొనసాగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu