HomeTelugu Trendingప్రభాస్‌ 'జాన్‌' అప్డేట్ ... స్టిల్‌ అదిరింది..

ప్రభాస్‌ ‘జాన్‌’ అప్డేట్ … స్టిల్‌ అదిరింది..

5 14
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ‘సాహో’ తరువాత నటిస్తున్న చిత్రం ‘జాన్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. పిరియాడికల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతవరకు పూర్తయింది. పూజా హెగ్డే హీరోయిన్. కాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది.

ప్రభాస్ ఓ వింటేజ్ హోమ్ లో ఓల్డేజ్ పియానో దగ్గర నిలబడి ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ప్రభాస్ జాన్ అప్డేట్ బయటకు రావడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా, ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu