నందిని రెడ్డి డైరెక్షన్‌లో సమంత హారర్ మూవీ

సమంత పెళ్లి తరువాత కూడా స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇటు సినిమాల్లో నటిస్తునే ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే ప్రారంభం కావల్సి ఉంది కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

అయితే ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. దీంతో సమంత తన తదుపరి చిత్రం మహిళ దర్శకురాలు నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’ వచ్చి సూపర్‌ హిటైన సంగతి తెలిసిందే. సమంత నందిని రెడ్డి డైరెక్షన్‌లో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. చైతూ.. ఓ బేబీ చిత్రంలో కూడా స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ సమంత, చైతూ కలిసి నటించిన చాలావరకు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరి అభిమానులు ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హారర్ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమాని చేయడానికి ప్లాన్‌ చేసింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయట. ఈ విషయంపై క్లారిటీ రావాల్సీ వుంది.

CLICK HERE!! For the aha Latest Updates