అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి !.. వైరల్‌

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్. ఈ హీరో పెళ్లిపై ఎప్పటికప్పుడు వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆయన పెళ్లి గురించి ఇప్పటికే ఎంతో ప్రచారం జరిగింది. సినీ నటి అనుష్కను పెళ్లాడబోతున్నాడంటూ కూడా అనేక సార్లు వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా, ఆయన పెళ్లికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నాడనేదే ఆ వార్త. ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. దీనిపై ప్రభాస్ నుంచి కానీ, ఆయన కుటుంబసభ్యుల నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి, ఈ వార్త నిజమా? లేక పుకారేనా? అనేది వేచి చూడాలి.