HomeTelugu Trendingమహేష్ బాబు మూవీలో ముగ్గురు బాలీవుడ్ స్టార్స్

మహేష్ బాబు మూవీలో ముగ్గురు బాలీవుడ్ స్టార్స్

Rajamouli and Mahesh Babu

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమా అఖండ విజయం తర్వాత రాజమౌళి తీయబోయే తదుపరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ అడ్వెంచర్‌‌ డ్రామా తీయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించారు. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టబోయే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

ప్రస్తుతం రాజమౌళి నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కీలక పాత్రల కోసం ముగ్గురు బాలీవుడ్ నటులను తీసుకుంటారని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu