HomeTelugu Big Stories“ఆదిపురుష్” రిలీజ్‌ డేట్‌ ప్రకటన

“ఆదిపురుష్” రిలీజ్‌ డేట్‌ ప్రకటన

Prabhas Adipurush release d

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్‌ నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. ప్రభాస్‌ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్నారు. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

ఈ చిత్రం 11 ఆగష్టు 2022 న విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని దర్శకుడు నిర్ణయించుకున్నారట. ఈ సినిమా 3డిలో విడుదల కానుంది. కాబట్టి షూటింగ్ కన్నా ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెకెక్కించనున్నారట. ఈ సన్నివేశాలను ప్రభాస్ డూప్ లేకుండా చేయనున్నారట. దాని కోసం స్టంట్స్ రిహార్సల్స్ చేయడం కూడా మొదలు పెట్టాడట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu