HomeTelugu Trendingసైన్స్ ఫిక్షన్ చిత్రంతో ప్రభాస్‌!

సైన్స్ ఫిక్షన్ చిత్రంతో ప్రభాస్‌!

7 8
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు.. నాగ్ అశ్విన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మహానటి వంటి బయోపిక్ తో స్టార్‌ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. నాగ్ అశ్విన్ ఇప్పుడు బాహుబలి హీరో ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. పాన్ ఇండియా మూవీ ఇప్పటికే చేసేశామని, ఇది ఇంటర్నేషనల్ సినిమా అని నాగ్ అశ్విన్ వెల్లడించాడు.

ఇక ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సమాచారం ప్రకారం, ప్రభాస్ చేయబోతున్న మూవీ సైన్స్ ఫిక్షన్ మూవీ అని హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. అందరి అంచనాలను అందుకునే విధంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఏ మాత్రం రాజీపడే సమస్య లేదని నాగ్ అశ్విన్ అంటున్నారు. వైజయంతి మూవీస్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu