HomeTelugu Trendingఫ్యామిలీతో ప్రభాస్‌ వెకేషన్‌

ఫ్యామిలీతో ప్రభాస్‌ వెకేషన్‌

6 3యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. బాహుబలి చిత్రం తరువాత దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. సాహో సినిమా ఫెయిల్ అయిన బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు సాధించింది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటను పండించింది. సినిమా విడుదల అయ్యాక ప్రభాస్ వెకేషన్‌ కు వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లినట్టుగా కనిపిస్తోంది. ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కజిన్ సిస్టర్, పెద్దమ్మతో కలిసి ప్రభాస్ వెకేషన్ కు వెళ్లారు.

ప్రభాస్ ఎదుగుదలలో కృష్ణంరాజు పాత్ర ప్రముఖంగా ఉన్నది. ప్రభాస్ వెన్నంటే ఉంది ప్రోత్సహించాడు. ఇప్పుడు ప్రభాస్ ఇండియన్ స్టార్ కావడంతో కృష్ణంరాజు సంతోషం వెలకట్టలేనిది. వెకేషన్ కు వెళ్ళినపుడు దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదుగాని ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇదిలా ఉంటె, సాహో తరువాత ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ కొంత షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu