HomeTelugu Trendingకొత్త సినిమా ప్రకటించిన విష్వక్సేన్‌

కొత్త సినిమా ప్రకటించిన విష్వక్సేన్‌

Vishwak Sen launches his crazy new film

టాలీవుడ్ యంగ్‌ హీరో విష్వక్సేన్ తాజాగా దస్‌ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో విష్వక్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

ఈ రోజు 29 విష్వక్సేన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించాడు ఈ హీరో. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిబోతున్న ఈ సినిమా విష్వక్సేన్‌కు 11వ చిత్రం. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

శ్రీకర స్టూడియోస్ దీనిని సమర్పిస్తోంది. విష్వక్సేన్‌ కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే దానిపై స్పష్టత రాలేదు. కానీ నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమా గురించి ప్రకటన వీడియో ప్రకారం ఈ చిత్రంలో విష్వక్సేన్ మునుపెన్నడూ లేని మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు వీడియో ద్వారా తెలుస్తుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu