నిర్మాతగా సమంత.?


టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు నటి అక్కినేని సమంత. గత కొంతకాలంగా ఆమె హీరోయిన్‌గా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాన్ని అందుకోంటున్నారు. అంతేకాకుండా ఓ నటిగా తనేంటో నిరూపించుకుంటోన్నారు. ఇటీవల ఆమె నటించిన ‘ఓ బేబి’ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే చిత్రపరిశ్రమలో హీరోయిన్‌ ప్రాధాన్యమున్న పాత్రలతోపాటు వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు సమంత ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. కథల పట్ల మంచి అభిరుచి ఉన్న సమంత రానున్న రోజుల్లో నిర్మాతగా మారనున్నారట. అందుకోసం ఆమె కొంతకాలంగా నిర్మాణ రంగం గురించి బాగా తెలుసుకుంటున్నారట. అప్పట్లో ‘చి.ల.సౌ’ కథ నచ్చేడం వల్లనే ఆ చిత్ర నిర్మాణంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ని సమంత భాగం చేశారు. మంచి కథలను ఎంపిక చేసుకుని త్వరలో పెద్ద ఎత్తున నిర్మాణం మొదలపెట్టాలని ఆమె భావిస్తున్నారట. ప్రస్తుతం హీరోయిన్‌ ప్రాధాన్యమున్న కథల్ని వింటున్న సమంత ఒకవేళ కథ నచ్చితే.. తానే నటిస్తూ, నిర్మాణం కూడా చేయవచ్చని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.