HomeTelugu NewsKalki 2898 AD: దీపికపై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్‌!

Kalki 2898 AD: దీపికపై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్‌!

Kalki 2898 ADKalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక
పాత్రల్లో నటిస్తున్నారు. అలానే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. వైజయంతీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మూవీ టీమ్‌. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జిని పరిచయం చేసేందుకు పెద్ద ఈవెంట్ కూడా నిర్వహించింది. ఇలా మూవీ టీమ్ ఇంత చేస్తుంటే దీపిక కనీసం ఆన్‌లైన్‌లో కూడా మూవీని ప్రమోట్ చేయడం లేదు. దీంతో దీపికపై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం దీపిక ప్రెగ్నెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కనుక నేరుగా ప్రమోషన్స్‌ చేయలేదు. కానీ తన సోషల్ మీడియాలో సినిమా గురించి ఎందుకు ప్రమోట్ చేయడం లేదనేదే అభిమానుల ప్రశ్న. రీసెంట్‌గా టీజర్ రిలీజైనప్పుడు కూడా దీపిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దాన్ని పోస్ట్ చేయడానికి రెండు రోజులు పట్టింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పటివరకూ కల్కి గురించి కేవలం రెండు అంటే రెండు పోస్టులే పెట్టింది దీపిక. అందులో ఒకటి కల్కి మొదలైనప్పుడు కాగా రెండోది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు పోస్ట్ చేసింది. ఇలా కల్కి సినిమా విషయంలో దీపిక చాలా లైట్‌గా ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్‌
అవుతున్నారు.

కాగా సోషల్‌ మీడియాలో దీపిక చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన మిగిలిన మూవీ ప్రమోషన్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. హృతిక్ రోషన్‌తో చేసిన ఫైటర్ సినిమా గురించి అయితే ఓ 20 పోస్టులు అయినా పెట్టి ఉంటుంది. వీటినే ప్రస్తావిస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

మరోవైపు కల్కిలో నటిస్తున్న దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్లకి లేని ఇబ్బంది దీపికకి ఏముందని అభిమానులు
అంటున్నారు. మరి దీనికి దీపికాయే సమాధానం చెప్పాలి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu