HomeTelugu Trendingమంచు విష్ణు 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్‌!

మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌!

Prabhas in Manchu Vishnus

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన తాజాగా ప్రకటించిన చిత్రం ‘కన్నప్ప’. ఇది మంచు విష్ణు కలల ప్రాజెక్టు. విష్ణు హీరోగా, నుపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. మోహన్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తకర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ విమర్శకుడు రమేష్ బాలా ఈ విషయాన్ని ట్విట్టర్‌‌లో వెల్లడించారు. సినిమాలో ప్రభాస్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కి మంచు విష్ణు బదులిస్తూ.. ‘హరహర మహాదేవ్’ అంటూ రీట్వీట్ చేశాడు. దాంతో, ప్రభాస్ నిజంగానే ఈ చిత్రంలో నటిస్తున్నాడా? నటిస్తే ఏ పాత్రలో కనిపిస్తాడు? అన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu