HomeTelugu Trending'కమిట్మెంట్‌' ట్రైలర్‌ విడుదల

‘కమిట్మెంట్‌’ ట్రైలర్‌ విడుదల

Commitment Movie Trailer

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కమిట్మెంట్’. లవ్ – డ్రీమ్ – హోప్ – ఫైట్ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. రెండేళ్ల క్రితమే పూర్తైన ‘కమిట్మెంట్’ సినిమా పాండమిక్ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఆగస్ట్ 19న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా ట్రైలర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ అంతా హాట్ రొమాంటిక్ సీన్స్ – గాఢమైన లిప్ లాక్స్ – బూతు డైలాగ్స్ తో నిండిపోయింది. ఈ సినిమాకి ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎఫ్3 ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై భల్ దేవ్ సింగ్ – నీలిమ నిర్మించారు. నరేష్ కుమారన్ సంగీతం సమకూర్చగా.. సజీష్ రాజేంద్రన్ – నరేష్ రానా సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu