HomeTelugu Trendingప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' న్యూపోస్టర్‌

ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ న్యూపోస్టర్‌

Prabhas new postr in Radheయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎదరుచూస్తోన్న టైమ్‌ వచ్చేసింది. ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలయ్యింది. రాధాకృష్ణ కుమార్‌ డైరెక్షన్‌లోవ వస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్‌ పుట్టినరోజును(అక్టోబర్‌ 23) సందర్భంగా ‘రాధేశ్యామ్‌’ సినిమా నుండి ఆయన లుక్‌ను తెలియజేసేలా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ రావడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu