HomeTelugu Trendingనితిన్ పెళ్లికి 'రంగ్ దే' టీమ్ గిఫ్ట్

నితిన్ పెళ్లికి ‘రంగ్ దే’ టీమ్ గిఫ్ట్

Rang De Team Gift To Nithinహీరో నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా త్వరలోనే మళ్ళీ చిత్రీకరణ ప్రారంభించబోతుందని సమాచారం.

కాగా హీరో నితిన్ – షాలినిల వివాహం సందర్భంగా ‘రంగ్ దే’ టీమ్ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయింది. ‘రంగ్ దే’ సినిమా నుంచి నితిన్-కీర్తి సురేష్ కలిసి ఉన్న ఓ క్యూట్ పిక్ రిలీజ్ చేసి జూలై 26న 4 గంటల5 నిమిషాలకు మ్యారేజ్ గిఫ్ట్ఇ వ్వబోతున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. దీంతో నితిన్ అభిమానులు ‘రంగ్ దే’ నుంచి రాబోయే గిఫ్ట్ కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu