‘రాజుగారి గది 3’ షూరు.. హీరోయిన్‌ ఎవరంటే

ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ 2015లో దర్శకత్వం వహించిన హారర్‌ కామెడీ చిత్రం ‘రాజుగారి గది’. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ‘రాజుగారి గది 2’ సీక్వెల్‌ను రూపొందించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘రాజుగారి గది 3’ రాబోతోంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఓంకార్‌ సోదరుడు అశ్వి‌న్‌బాబు హీరోగా నటించనున్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఓంకార్‌ దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ కార్యక్రమాలు కూడా చూసుకుంటారు. దిల్‌రాజు క్లాప్‌నిచ్చారు. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.