HomeTelugu Newsఓటీటీలో కృష్ణుడు తొలి సినిమా.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

ఓటీటీలో కృష్ణుడు తొలి సినిమా.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Prabhas promotes boyfriend 1 1
టాలీవుడ్‌లో ‘వినాయకుడు’ సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణుడు ఇప్పుడు నిర్మాతగా మారాడు. తన కూతురు నిత్య పేరు మీద ‘నిత్య క్రియేషన్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆయన తొలిసారిగా ‘మై భాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్”‌ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో లోతుగుడ్డ జయరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇక ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ కృష్ణుడికి అలాగే చిత్రబృందనికి అభినందనలు తెలిపారు. అలాగే ఈ సినిమా ‘ఓటీటీ’ లో విడుదల కాబోతున్నట్లు తెలిపారు. అయితే ప్రభాస్ తో సినిమా ప్రమోషన్స్ చేయించడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు భారీ ధర పలుకనున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu