HomeTelugu Big Storiesప్రభాస్‌ 'సాహో' ట్రైలర్‌ వచ్చేసింది

ప్రభాస్‌ ‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

4 9యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇది. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. దర్శకుడు సుజీత్‌ పూర్తి యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు.

ఇందులో ప్రభాస్‌.. అశోక చక్రవర్తి అనే అండర్‌ కవర్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రూ.2వేల కోట్ల దోపిడికీ సంబంధించిన కేసును ఛేదించేందుకు పోలీసులు ఆయన్ను రంగంలోకి దింపే సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమైంది. శ్రద్ధాకపూర్‌.. అమృతనాయర్‌ అనే క్రైం బాంచ్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆ దోపిడీ కేసును ఎలా ఛేదించారు? అందులో ఎవరెవరి హస్తం ఉంది? ఈ కేసును ఛేదించే క్రమంలో అశోక్‌ చక్రవర్తి, అమృతనాయర్‌లకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలియాలంటే ఆగస్టు 30 వరకూ వేచి చూడాల్సిందే. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్‌ కనిపిస్తోంది.

నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu