HomeTelugu Big Storiesగుంటూరు కారం ట్విట్టర్‌ రివ్యూ

గుంటూరు కారం ట్విట్టర్‌ రివ్యూ

Guntur Kaaram 3
సూపర్ స్టార్‌ మ‌హేష్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ డైరెక్షన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. మూవీ సంక్రాంతి కానుక‌గా శుక్ర‌వారం (జనవరి12)న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌హేష్‌బాబు మాస్ పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి.ఇక ఇప్పుడు వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ కూడా ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ ఇచ్చాయి.

ఈ సినిమాలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌ ద్వారా తమ రివ్యూలను తెలిపారు.

గుంటూరు కారం సినిమాలో వింటేజ్ మహేష్ బాబు కనిపించాడని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. గుంటూరు యాసలో మ‌హేష్ డైలాగ్స్‌, కామెడీ టైమింగ్‌తో అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. ఖ‌లేజాకు మించి కామెడీ టైమింగ్‌తో మ‌హేష్ క్యారెక్ట‌ర్‌ను గుంటూరు కారంలో త్రివిక్ర‌మ్ డిజైన్ చేశాడ‌ని చెబుతున్నారు. ఈ సినిమా మ‌హేష్ వ‌న్ మెన్ షో అని కామెంట్స్ చేస్తున్నారు.

త‌ల్లీకొడుకుల అనుబంధంతో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ మూవీని తెర‌కెక్కించాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో పాటు అంతర్లీనంగా ఓ మెసేజ్ ఉంటుంది. కానీ గుంటూరు కారం కంప్లీట్‌గా క‌మ‌ర్షియ‌ల్ కోణంలోనే సాగుతుంద‌ని, ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉండ‌ద‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు. మ‌హేష్‌, ర‌మ్య‌కృష్ణ కాంబినేష‌న్ సీన్స్‌లోని సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని అంటున్నారు.

ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫ‌స్ట్ హాఫ్ ఫాస్ట్ ఫేజ్‌లో సాగుతుంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు. యాక్ష‌న్ సీక్వెన్స్ గూస్‌బంప్స్ క‌లిగిస్తాయ‌ని అంటున్నారు. మహేష్ మాస్ ఎలివేసన్స్ మెప్పిస్తాయని అభిమానులు పేర్కొంటున్నారు. ఎలాంటి ట్విస్ట్‌, ట‌ర్న్‌లు లేకుండా సెకండాఫ్ ఫ్లాట్ గా సాగుతుంద‌ని చెబుతున్నారు.

రొటీన్ స్టోరీతో గుంటూరు కారం మూవీని త్రివిక్రమ్ తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. త్రివిక్ర‌మ్ శైలి మ్యాజిక్‌, డైలాగ్స్ గుంటూరు కారంలో క‌నిపించ‌లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త‌మ‌న్ బీజీఎమ్‌తో పాటు కుర్చీ మ‌డ‌త‌పెట్టి సాంగ్ మాత్రం అదిరిపోయింద‌ని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మ‌హేష్‌, శ్రీలీల కాంబినేష‌న్ సీన్స్ కూడా బాగున్నాయ‌ని టాక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu