ఆ హీరో ఇంటికి వెళ్ళిన మోహన్ బాబు!

ఆ హీరో ఇంటికి వెళ్ళిన మోహన్ బాబు!
రెండు రోజుల క్రితం యంగ్ హీరో వరుణ్ సందేశ్ కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వితికా అనే 
అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రెండు, మూడు చిత్రాల్లో మెరిసింది. వీరి 
కళ్యాణ వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రముఖులు హాజరయ్యారు. మోహన్ బాబు కు కూడా 
ఆహ్వానాన్ని అందించారు. కానీ ఆ సమయంలో ఆయన బిజీగా ఉండడం వలన పెళ్ళికి వెళ్లలేకపోయారు.దీంతో స్వయంగా ఇంటికి వెళ్ళి నూతన దంపతులను ఆశీర్వదించారు. వరుణ్ సందేశ్ గతంలో మోహన్ బాబు నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’,’పాండవులు పాండవులు తుమ్మెద’ 
వంటి చిత్రాల్లో నటించాడు. ఆ సాన్నిహిత్యంతోనే మోహన్ బాబు, వరుణ్ ఇంటికి వెళ్ళి మరీ 
ఆశీర్వదించారు. మోహన్ బాబు గారు అందించిన ప్రేమకు థాంక్స్ అంటూ వరుణ్ ట్వీట్ చేశాడు. 
CLICK HERE!! For the aha Latest Updates