HomeTelugu Trendingమరో రికార్డ్ క్రియేట్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

మరో రికార్డ్ క్రియేట్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

Prabhas most handsome asian

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్‌ను సెట్‌చేసిన ప్రభాస్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రభాస్ లుక్స్, సింప్లిసిటీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల విడుదలైన ఈ జాబితాలో ప్రపంచంలోని అందగాళ్ళలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా స్టార్ కిమ్ హ్యూన్ జోంగ్ 4వ స్థానం, పాకిస్తాన్ హార్ట్‌త్రోబ్ ఫవాద్ ఖాన్ 8వ స్థానంలో ఉన్నారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి ఇండియా, సౌత్ ఇండియా హీరో కూడా ప్రభాస్ కావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu