HomeTelugu Trending'లైగర్'​ సినిమా బృందంతో కలిసిన ప్రభుదేవా

‘లైగర్’​ సినిమా బృందంతో కలిసిన ప్రభుదేవా

Prabhudeva with Liger team
విజయ్ దేవర కొండ తాజా చిత్రం లైగర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న లైగర్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. అనన్య పాండే హీరోయిన్‌. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్, ఛార్మి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర బృందంతో ప్రముఖ నటుడు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా కలిసి ఉన్న ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. దీన్నిబట్టి ప్రభుదేవా లైగర్ చిత్రంలో ఏదైనా స్పెషల్ సాంగ్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడా లేక ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నాడా అనేది ప్రేక్షకుల ఆసక్తి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu