HomeTelugu Trendingబాలయ్య సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌

బాలయ్య సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌

Pragya one of the heroine i

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న ‘BB3’లో బీజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. వీద్దరి కాంబినేషన్‌లో ఇది మూడోవ చిత్రం కావడంతో దీని భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అఖిల్ ఫేమ్ సయేషా సైగల్‌ హీరోయిన్‌గా నటించిననున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారీకంగా ప్రకటించింది. వెల్‌కమ్ టూ బోర్డ్ అంటూ సయేషా పోస్టర్ రీలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా వరుణ్ తేజ్.. కంచె ఫేమ్ ‘ప్రగ్యా జైస్వాల్ మరో కథానాయికగా బాలయ్య సరసన ఎంపిక చేశాడు. కంచె తర్వాత ఈమె నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఫోటో షూట్స్‌లో కాలం గడిపిస్తోంది. ఈ శనివారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రగ్యా జైస్వాల్ షూటింగ్‌లో అడుగుపెట్టనుంది. ఈ షెడ్యూల్లో బాలయ్యతో పాటు ప్రగ్యా పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇక హాట్ బ్యూటీ నమిత రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించబోతుంది. ప్రతినాయక పాత్రలో ఈమె నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. గతంలో సింహా సినిమాలో కలిసి నటించారు బాలయ్య, నమిత. . అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు ఈ చిత్రంలో బాలయ్య త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu