టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్ – ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తమ తొలి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. వీరికి పుట్టబోయే బిడ్డ కోసం.. మెగా కుటుంబంతోపాటు, అభిమానులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జులై నెలలో ఉపాసన డెలివరీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజాగా ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ అందమైన గిఫ్ట్ ను అందుకున్నారు. ప్రజ్వలా ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన ఉయ్యాల ను ఉపాసన-చరణ్ దంపతులకు బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఉయ్యాలను తయారు చేస్తున్న వీడియోను పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.
‘మీ (ప్రజ్వలా ఫౌండేషన్) నుంచి ఈ అద్భుత కానుకను అందుకోవడం ఎంతో గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా. మీ చేతులతో తయారు చేసిన ఈ ఊయలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ధైర్యం, బలం, ఆత్మగౌరవం, ఆశకు ప్రతీక. మీరు పంపిన ఈ అద్భుత కానుక నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రజ్వలా ఫౌండేషన్ సెక్స్ ట్రాఫికింగ్ బాధిత మహిళలకు ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు