HomeTelugu Big Storiesశ్యామ్ సింగరాయ్: 'ప్రణవాలయ' పాటతో ఆకట్టుకున్న సాయి పల్లవి

శ్యామ్ సింగరాయ్: ‘ప్రణవాలయ’ పాటతో ఆకట్టుకున్న సాయి పల్లవి

Pranavalaya Lyrical from Sh

నేచురల్‌ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న రిలీజ్‌ కానుంది. శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్. వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి పాట సిరివెన్నెల సాంగ్ ని రిలీజ్ చేసి ఆయనకు అంకితమిచ్చారు. ఇక తాజాగా ఆయన రాసిన రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ప్రణవాలయ పాహి.. పరిపాలయల పరమేసి..’ అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటోంది.

సాయి పల్లవి అద్భుతమైన డాన్స్ , ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఈ పాటకే హైలెట్ గా నిలిచాయి. దేవదాసి పాత్రలో నాటక రూపంలో మహంకాళి అమ్మవారిగా సాయిపల్లవి కనిపించింది. ఇక ఆమె డాన్స్ కి మంత్రముగ్దుడై చూస్తున్న శ్యామ్ సింగరాయ్ గా నాని కనిపించాడు. అనురాగ్ కులకర్ణి ఉత్సాహంగా పాడిన ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu