20 సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ప్రీతి జింతా ఒకరు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో వరసగా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది ప్రీతి. ఒకటి వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమంటే ఇదేరా కాగా రెండో సినిమా మహేష్ బాబు రాజకుమారుడు. ఈ సినిమాతోనే మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
బాలీవుడ్ అనేక హిట్ సినిమాల్లో నటించిన ప్రీతి జింతా 2016 లో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా క్రమం తప్పకుండా జిమ్ లకు వెళ్తూ.. ఫిట్ నెస్ ను కాపాడుకుంటోంది ప్రీతి. ప్రీతి జింతా వయసు 44 సంవత్సరాలైనప్పటికి ఫిట్నెస్ పరంగా చూసుకుంటే 22 లా కనిపిస్తుంది. రీసెంట్ గా ప్రీతి జింతా సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఫీల్ టచ్ క్లౌడ్ 9 ని ట్యాగ్ లైన్ ఇచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
Trying to touch cloud 9 in the gym 🤩 #cardiolates #jumpingjacks #trampoline #pzfit #ting pic.twitter.com/7ypBOsTCR1
— Preity G Zinta (@realpreityzinta) April 4, 2019













