
Preity Zinta Net Worth:
బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్‌కి ఫేవరెట్. కానీ ఆమె నటనలో మాత్రమే కాకుండా బిజినెస్‌లోనూ సూపర్ సక్సెస్‌ఫుల్ అనే సంగతి కొందరికే తెలుసు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ప్రీతి రూ. 35 కోట్లతో పంజాబ్ కింగ్స్ జట్టులో భాగస్వామిగా మారింది. అప్పట్లో ఇదొక పెద్ద గ్యాంబుల్ లాగా అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పెట్టుబడి దాదాపు రూ. 350 కోట్లకు చేరింది! అంతేకాదు, జట్టు మొత్తం విలువ 76 మిలియన్ డాలర్ల నుంచి 925 మిలియన్ డాలర్లకు పెరగడం ఆమె బిజినెస్ దుర్దృష్టిని చూపిస్తోంది.
ప్రీతి లైఫ్‌స్టైల్ కూడా రిచ్ అండ్ ఎలిగెంట్. ముంబైలోని పాలి హిల్‌లో రూ. 17 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉంది. శిమ్లాలో తల్లి పుట్టిన ఊరిలో రూ. 7 కోట్ల విలువైన హౌస్ కూడా ఉంది. 2016లో జీన్ గుడినఫ్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె లాస్ ఏంజెలిస్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ భర్తతో కలిసి బెవర్లీ హిల్స్‌లో భారీ విలువైన బంగ్లాలో twins పిల్లలతో హ్యాపీగా ఉంటోంది.
లగ్జరీ కార్లు ఆమెకు బాగా ఇష్టం – ఆమె దగ్గర Lexus LX 470, Porsche, BMW, Mercedes-Benz E-Class వంటివి ఉన్నాయి.
ఇక సినిమాల్లోకి రీఎంట్రీ కూడా ఇవ్వబోతోంది ప్రీతి. 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘లాహోర్ 1947’ సినిమాతో బోల్డ్ రీటర్న్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను రాజ్‌కుమార్ సంతోషి డైరెక్ట్ చేయగా, ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇందులో సన్నీ డియోల్, కియారా, శబానా అజ్మీ వంటి స్టార్స్ నటిస్తున్నారు.