HomeTelugu Trending'ప్రేమ్ కుమార్' ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

‘ప్రేమ్ కుమార్’ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

Prem kumar movie glimpse re

టాలీవుడ్‌ లో ‘పేపర్ బాయ్’ సినిమాతో ఎంట్రీ.. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి గుర్తింపు తెచుకున్నాడు సంతోష్ శోభన్. ప్రస్తుతం రెండు సినిమాలు – ఒక వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసి మరో సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. వాటిలో ‘ప్రేమ్ కుమార్’ సినిమా ఒకటి. వినోదమే ప్రధానంగా నిర్మితమైన చిత్ర ‘ప్రేమ్ కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్టులుక్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. తన మనసుకు నచ్చే అమ్మాయి కోసం పెళ్లికొడుకుగా హీరో పడే పాట్లను కామెడీగా చూపించారు. సరదాగా ఉన్న ఫస్ట్ గ్లిమ్స్ అందరినీ నవ్విస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా కూడా చెప్పేశారు. ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించనున్నంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu