HomeTelugu Trending‘ఏక్‌ మినీ కథ’ హీరో కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

‘ఏక్‌ మినీ కథ’ హీరో కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

Santosh Sobhan new movie p

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్‌శోభన్‌ ‘పేపర్ బాయ్’ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ‘ఏక్‌ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకోవడమే కాకుండా.. యువ హీరో నటనకు మంచి మార్కులు పడ్డాయి. బోల్డ్ కథలో ఆత్మనూన్యతా భావం గల యువకుడిగా సంతోష్ శోభన్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ప్రేమ్ కుమార్’ అనే టైటిల్ తో తన కొత్త సినిమాని ప్రకటించాడు.

ఈ మేరకు శుక్రవారం ఉదయం టైటిల్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. అభిషేక్‌ మహర్షి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి యానిమేటడ్‌ లుక్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో హీరో సంతోష్‌ శోభన్‌ ఒక చేతిలో మంగళసూత్రాలతో పెళ్లి కొడుకుగా ముస్తాబై ఎవరికోసమో వెతుకుతున్నట్లు కనిపించారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శివ ప్రసాద్‌ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తైనట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా లాక్‌డౌన్‌ అనంతరం వెంటనే మిగతా షూట్‌ పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించింది. ఈ సినిమాలో కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి , మధు తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu