త్రిష @ 96!

96 కి త్రిషకు లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? అది ఆమె నటించే సినిమా టైటిల్.. అవును ’96’ అనేది టైటిల్. తెలుగు, తమిళ బాషల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన త్రిష దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ప్రస్తుతం గ్లామర్ ను పక్కన పెట్టేసి హీరోయిన్ ఓరియెంటెడ్
సినిమాల్లో నటిస్తోంది. అందులో భాగంగానే ‘నాయకి, కోడి’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ సినిమాల రిజల్ట్స్ సంగతి ఎలా ఉన్నా.. నటిగా త్రిషకు మంచి పేరే వచ్చింది. దీంతో తన తదుపరి సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటోంది.

ఈ క్రమంలో ‘మొహిని’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఆమె ప్రేమ్ కుమార్ అనే దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి ’96’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా 1996 వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందనుంది. 96 చుట్టూనే హీరోయిన్ పాత్ర తిరుగుతుందని సమాచారం.