HomeTelugu Trendingలియో: 'ప్రేమ ఓ ఆయుధం' లిరికల్‌ సాంగ్‌

లియో: ‘ప్రేమ ఓ ఆయుధం’ లిరికల్‌ సాంగ్‌

Prema Oh Ayudham Lyric from

తమిళ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాని సెవెన్ స్క్రీన్ స్టుడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించారు. ఈ నెల 19వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ‘ప్రేమ ఓ ఆయుధం’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘రాసిచ్చాలే మనసే .. చేసేస్తాలే తపస్సే’ అంటూ ఈ పాట మొదలవుతోంది. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, జేవీ సుధాన్షు – ప్రియమాలి ఆలపించారు.

ఈ పాటను హీరో – హీరోయిన్ .. వాళ్ల పాపపై చిత్రీకరించారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu