‘ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’!

ఎస్‌బి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఎజిల్‌ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్‌ కాదలా’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’ పేరుతో అనువదిస్తున్నారు ఎస్‌. బాలసుబ్రమణ్యన్‌. మధుమిల, అభినయ హీరోయిన్లుగా నటించారు. లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌. బాలసుబ్రమణ్యన్‌ మాట్లాడుతూ… ‘ఎజిల్‌ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనువాద కార్యక్రమాలు చేశాం. ఇంతవరకు ఎవరూ షూటింగ్‌ చేయని లొకేషన్లలో చిత్రీకరించాం. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించాం. ‘ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’ టైటిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకి, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్‌ రావడంతో ఏపీ, తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్‌ మా చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకొచ్చారు. మార్చిలో సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహా లు చేస్తున్నాం’ అన్నారు.
ఎజిల్‌ దురై, మధుమిల, అభినయ, మైమ్‌ గోపి, మద్రాస్‌ రమ, మహానది శంకర్‌, అజయ్‌ రత్నం, వేన్‌, కాయల్‌ విన్సెంట్‌ తదిత రులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎం.మనీష్‌, ఎడిటర్‌: లారెన్స్‌ కిషోర్‌, సంగీతం: రాజ్‌భరత్‌, నిర్మాత: ఎస్‌.బాలసుబ్రమణ్యన్‌, దర్శకత్వం: ఎజిల్‌ దురై.