HomeTelugu Newsతెలుగులో ప్రియా ప్రకాశ్‌ మూవీ!

తెలుగులో ప్రియా ప్రకాశ్‌ మూవీ!

3 21మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్‌ వారియ‌ర్ కొంటెగా కంటి సైగ చేస్తే రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి మ‌రీ యువ‌కులు ఆమె గురించి ఆరా తీశారు. ఆమె నటించిన ‘ఒరు అదార్‌ లవ్‌’లోని 27 సెక‌న్ల వీడియో కేవలం రెండు రోజుల్లోనే 45 ల‌క్ష‌ల వ్యూస్ దక్కించుకుంది. అంత‌టి క్రేజ్‌ ఉన్న ప్రియా వారియర్‌ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘ఒరు అదార్ ల‌వ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ల‌వ‌ర్స్ డే’ పేరుతో సుఖీభ‌వ సినిమాస్ సంస్థ విడుద‌ల చేస్తోంది. ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి నిర్మాత‌లు. ఒమ‌ర్ లులు చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా గురించి నిర్మాత‌లు మాట్లాడుతూ.. ‘ప్రియా ప్ర‌కాశ్‌ వారియ‌ర్ న‌టించిన ‘ఒరు అదార్ ల‌వ్’ గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. ప్రియ చేసిన ఒక్క కంటి సైగ‌తో ఆ సినిమాకు వ‌చ్చిన క్రేజ్ అంత గొప్ప‌ది. ఆ చిత్రం తెలుగు హ‌క్కుల కోసం చాలా మంది ప్ర‌య‌త్నించారు. భారీ పోటీ మ‌ధ్య హ‌క్కుల‌ను మేం ద‌క్కించుకున్నాం. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న తెలుగులో ‘ల‌వ‌ర్స్ డే’ పేరుతో చిత్రాన్ని విడుద‌ల చేయబోతున్నాం. 2018లో గూగుల్ ట్రెండింగ్‌లో ఉన్న ప్రియకు తెలుగులోనూ విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఆమెను హీరోయిన్‌గా పెట్టి తెలుగులో సినిమా చేయ‌డానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా ప్రతి సామాజిక మాధ్య‌మంలోనూ ఆమె పేరును జ‌పించే వారి సంఖ్య అత్య‌ధికం. ‘ఒరు అదార్‌ లవ్‌’ లోని పాట వీడియోను ఇప్పటికి రెండు కోట్ల మంది చూశారు. అంతటి క్రేజీ ప్రాజెక్టును మేం తెలుగులో విడుద‌ల చేస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. రొమాంటిక్ కామెడీ చిత్ర‌మిది. షాన్ రెహ‌మాన్ సంగీతం హైలైట్ అవుతుంది’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu