HomeTelugu Newsశశికళ పాత్రలో ప్రియమణి!

శశికళ పాత్రలో ప్రియమణి!

9 1
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంగనా హీరోయిన్. జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఎంజీఆర్ గా అరవింద స్వామి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అమ్మ జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయం నిన్నటి వరకు సస్పెన్స్ గా ఉంది. అనేక పేర్లు తెరపైకి వచ్చినా ఎవరినీ నిర్ణయించలేదు. అయితే, ఇప్పుడు శశికళ పాత్రలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu